Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు అరవింద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేత రంగాన్ని కుదేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని వేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ చైర్మెన్ రాష్ట్ర అధ్యక్షులు అలిశెట్టి అరవింద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ పర్యటనను నిరసిస్తూ ఇప్పటికే నగరంలో తమ సంఘం ఆధ్వర్యంలో ప్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బీసీ అని చెప్పుకునే మోడీ హయాంలో అత్యధికంగా నష్టపోయింది బీసీలేననీ, అందులోనూ చేనేత సమాజానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు.
కార్మిక సంఘాల నిరసనకు
రైతు సంఘం మద్దతు : సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన మోడీ గో బ్యాక్ నిరసనకు తెలంగాణ రైతు సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొని మద్దతు తెలియజేయాలని ప్రజలకు, రైతులకు పిలుపునిచ్చారు.