Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాలగీత్ కవితాయే సంకలనానికి సంబంధించిన పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల హిందీ సాహితీవేత్తలు 77 మంది కవులతో బాలసాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు, విద్యార్థుల్లో హిందీ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ పుస్తకాన్ని ఆర్‌యూపీపీ రాష్ట్ర అధ్యక్షులు సి జగదీశ్ నేతృత్వంలో రూపొందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ఇలాంటి పుస్తకాలు వెలికితీస్తాయని మంత్రి అన్నారు. ఇలాంటివి మరిన్ని రావాలనీ, హిందీ భాషా సాహిత్యాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీ అధ్యక్షులు సి జగదీశ్, ఉపాధ్యక్షులు ఎంఎన్ విజయ్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, కార్యదర్శులు హలీం, అత్తర్పాషా తదితరులు పాల్గొన్నారు.