Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ కిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం చిక్కడపల్లిలో పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్టు నవతెలంగాణ పబ్లిషింగ్హౌస్ మేనేజర్ డి.కిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పుస్తక ప్రదర్శన ప్రారంభ సభలో హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారిణి ఆర్.రోహిణిగారు, గ్రంథాలయ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి పాల్గొంటారని తెలిపారు. బాలసాహిత్యం, డ్రాయింగ్, పిల్లలకు సంబంధించిన తదితర పుస్తకాలను ప్రదర్శనలో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రదర్శనను నగరవాసులు ఉపయోగించుకోవాలని కోరారు.