Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 53 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక
- కేంద్ర కమిటీలో తెలంగాణ, ఏపీ నుంచి చెరొకరికి చోటు
న్యూఢిల్లీ :ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా మనోజ్ భట్టాచార్య తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 53 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చెరొకరికి కేంద్ర కమిటీలో చోటు దక్కింది. గత మూడు రోజులు పాటు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఆర్ఎస్పీ 22వ జాతీయ మహాసభ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నూతన కేంద్ర కమిటీని మహాసభ ఎన్నుకున్నది. ప్రధాన కార్యదర్శిగా మనోజ్ భట్టాచార్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 53 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక అయింది. కేంద్ర కమిటీకి తెలంగాణ నుంచి జూపల్లి జానకి రాములు, ఆంధ్రప్రదేశ్ నుంచి నేరెళ్ల కళ్యాణ్ ఓబులేష్ ఎన్నిక అయ్యారు. కేంద్ర కమిటీకి పశ్చిమ బెంగాల్ (23), కేరళ (20), తమిళనాడు (2), ఢిల్లీ (2), ఏపీ, తెలంగాణ, అసోం, జార్ఖండ్, త్రిపుర, పంజాబ్ నుంచి ఒక్కొక్కరు ఎన్నిక అయ్యారు. మహాసభకు 12 రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకాగా, ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 9 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర కార్యవర్గం సంఖ్యను 11 నుంచి 15 పొడిగించారు.