Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా
- బీకేఎస్ ఆధ్వర్యంలో రైతు గర్జన బహిరంగ సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతులు పండించిన పంటల ఉత్పత్తులను లాభసాటి ధరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ కిసాన్ సంఫ్‌ు అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా డిమాండ్ చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్లో బీకేఎస్ ఆధ్వర్యంలో రైతు గర్జన మహాసభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజా బ్, హర్యానా రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ ఇక్కడి రైతులపై తెలంగాణ సీఎంకు లేదని విమర్శించారు. క్వింటాల్ వడ్లకు 10 కేజీలు తాలు పేరుతో నష్టం చేస్తున్న కేసీఆర్‌కు రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు. పంజాబ్ మండిలో రైతుల వద్ద నుంచి వ్యాపారులు కోట్ల రూపాయలు లూటీ చేస్తూ మోసం చేస్తున్నారన్నారు. బీకేఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పర్యాద అంజిరెడ్డి.. మాట్లాడుతూ..కూరగాయలు అమ్మే వాళ్లకు ఉన్న ఆదాయం పండించిన రైతుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఐక్యమై పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జాతీయ కార్యదర్శి కొండెల సాయి రెడ్డి మాట్లాడుతూ..తమ సంఘానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదనీ, రైతుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని తెలిపారు. బీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి.రంగారావు అధ్యక్షత వహిం చారు. నేతలు డి.రాము, నానా ఆక్రే, ఎం.శ్రీధర్ రెడ్డి, జె. కుమారస్వామి, ఎం.రాజిరెడ్డి, పి.వెంకట రెడ్డి, గైని నాగేశ్వర్, లావణ్య, యల్ మాణిక్ రెడ్డి, అంబిర్ ఆనంద రావు బోరంపేట మల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.