Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నారాయణపేట జిల్లాలో పసికందును కడతేర్చిన తల్లి
నవతెలంగాణ- కోస్గి
మతిస్థిమితం సరిగా లేని తల్లి తన ఐదు నెలల పసికందును బావి లో పడేసి కడతేర్చారు.. ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో ఆదివారం జరిగింది. బాధి తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని హరిజనవాడకు చెందిన గోవిందుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కొడుకు, కూతురు సంతానం. రెండో భార్య ఆశమ్మ మూగది. ఐదు నెలల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పసిబిడ్డను బావిలో పడేసింది. ఉదయం కుటుంబ సభ్యులు బిడ్డ కోసం వెతికారు. జాడ తెలియక పోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆశమ్మపై అనుమానంతో పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టారు. సైగలతో బిడ్డను బావిలో పడేసినట్టు చెప్పింది. దాంతో ఘటనాస్థలానికి ఆమెను తీసుకొస్తే.. బావిలోకి చూపించింది. స్థానికుల సహాయంతో పోలీసులు పసిబిడ్డ మృతదేహాన్ని పైకి తీశారు.