Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ హక్కుల సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ కుల గణనతో సహా డిమాండ్ల సాధనకు ఈ నెల 15న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలను జయ ప్రదం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రాములు, పాండురంగా చారి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ జన గణన లో బీసీ కులగణన చేపట్టాలనీ, జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి బీసీల సంక్షేమానికి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీల పట్ల వివక్షత చూపడం సహించరానిదని పేర్కొన్నారు. కేంద్రంలో తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు ఏర్పాటు చేసి బీసీల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నారు.