Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
వ్యాపారి అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామానికి చెందిన ఎడ్ల కిషోర్‌గౌడ్ వృత్తిరీత్యా వ్యాపారి, అతను ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దాంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌కు లేదా కుటుంబ సభ్యులైన కిరణ్‌గౌడ్ (9391225804) సమాచారం ఇవ్వాలని కోరారు.