Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ఎన్నికల కోసం 1.35 లక్షల కేంద్రం నిధులు
- తెలంగాణకు చేసిందేమీ లేదు : బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ అంటే బడా జుమ్లా పార్టీ అని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం 1.35 లక్షల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. తెలంగాణకు మోడీ సర్కారు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ తన నయవంచన మాటలతో రాష్ట్ర ప్రజలను మరోమారు మోసం చేశారన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ప్రాజెక్టులకు జాతీయ హౌదా కల్పించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలు ఇవ్వాలనీ, నవోదయ విద్యాలయాలు పెట్టాలని కోరారు. తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేక, ప్రధాని మోడీ విషం కక్కుతున్నాడని విమర్శించారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టిన బీజేపీ, తెలంగాణలో కూడా ప్రయత్నిస్తే బీజేపీ ఏజెంట్లను జైల్లో పెట్టామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కమీషన్లు ఉన్నాయనీ, కర్ణాటకలో కమీషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నడని గుర్తుచేశారు.