Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీజేపీ నేత మందాడి సత్యనారాయణరెడ్డి ఆదివారం ఉదయం హన్మకొండలోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. 2004 ఎన్నికల్లో నాటి హన్మకొండ నియోజకవర్గం నుంచి టీఆఅనంతరం ఆయన టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చారు.
ఎమ్మెల్యే పదవీకాలం ముగిశాక బీజేపీలో చేరారు. బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి.. ఆ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎదిగారు. తెలగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. 'మందాడి' మృతి పట్ల బీజేపీ నేతలు ఎం. ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రావు పద్మ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
'మందాడి' మృతి తీరని లోటు : గవర్నర్ బండారు దత్తాత్రేయ
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి సమాజ సేవకుడు, జాతీయ భావాలతో రైతుల కోసం నిస్వార్ధంగా పనిచేసిన నేత అని, అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమని, ఆయన మృతికి హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.