Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నందకుమార్ హోటల్ కూడా..
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆదివరం కూల్చివేశారు. స్థానికంగా ఉన్న దక్కన్ హోటల్లో కొంత భాగం అనుమతి లేకుండా నిర్మించారని అధికారులు జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో కూల్చేశారు. దక్కన్ హోటల్.. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ నడుపుతున్నారు. ఈ హోటల్ స్థలాన్ని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు కుటుంబ సభ్యుల నుంచి లీజుకు తీసుకొని నడుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం నందకుమార్ జైలులో ఉన్నాడు.