Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశాభివృద్ధికి తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ వేసిన పునాదులే కారణమని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. స్వాతంత్య్రం, బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తైతే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందన్నారు.
సోమవారం హైదరాబాద్లో నెహ్రు జయంతి సందర్భంగా గాంధీభవన్లో ఆయన నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పంచవర్ష ప్రణాళికలు, పరిశ్రమలు, ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించడంలో నెహ్రూ కారణమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో తప్పులు చేస్తున్నాయని చెప్పారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన ఆయన...స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన నేత అన్నారు. అలీన దేశాల నాయకుడిగా విధులు నిర్వహించారని చెప్పారు. ఆజాది కా అమృత్ ఉత్సవ్ నెహ్రూ ఫోటో లేకుండా చేయడం ఏంటని ప్రశ్నించారు.