Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అత్యంత పేదరికంలో జీవిస్తున్న వడ్డెర వృత్తిదారులకు రుణాలిచ్చి ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటి నాయకులు పైళ్ళ ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని వృత్తిదారుల రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటి సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగోటి సాయిలు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది వడ్డెర వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బాగా వెనుకబడిన వారేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వడ్డెర ఫెడరేషన్‌కు నిధులు కేటాయించడంలో వివక్షతను చుపిస్తున్నదని విమర్శించారు. వారికి ప్రత్యేక నిధులు కేటాయించి, రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో వడ్డెర కార్మికులకు ఉపాధి కల్పించాలనీ, జేసీబీలు, అధునాతన సాంకేతిక పనిముట్లు, వృత్తి శిక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విజ్ఞేశ్, గౌరవ అధ్యక్షులు కుంచం వెంకటకృష్ణ, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ డేరంగుల రామకృష్ణ, రాష్ట్ర నాయకులు వరికుప్పలముత్యాలు, మక్కల శ్రీశైలం, డి జయరాములు, దండుగుల నరసింహులు, బాలయ్య తదితరులు పాల్గోన్నారు.