Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత సామరస్యంతో మెలుగుదాం : ఐద్వా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నేటి బాలలే రేపటి పౌరులని వీరనారి ఐలమ్మ ట్రస్టు కార్యదర్శి బి హైమావతి తెలిపారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని వీరనారి ఐలమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో బాలలకు డ్రాయింగ్, మ్యూజికల్ చైర్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రారంభించారు. పోటీలో గెలుపొందిన పిల్లలకు బహుమతులు అందజేశారు. మ్యూజికల్ చైర్స్‌లో మొదటి బహుమతి రిజ్వానా, రెండో బహుమతి మేఘన, మూడో బహుమతి కార్తీక్ పోందారు. చిత్ర లేఖనంలో మొదటి బహుమతి రక్షిత, రెండో బహుమతి సంజన అందుకున్నారు. అనంతరం ఐద్వా అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హైమావతి మాట్లాడుతూ కుల, మత, జాతి,లింగ తేడాలు లేని సమాజం వైపు అడుగేయాలన్నారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఆటల ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయోచ్చన్నారు. పాఠశాలల్లో క్రీడా సౌకర్యాలు లేవని చెప్పారు. పిల్లలకు మానసికోల్లాసం ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మెన్ బి సరళ, కోశాధికారి కెఎన్ ఆశాలత, సభ్యులు డి ఇందిర, ఐద్వా నాయకులు విశాలక్ష్మి, శారద, కవిత, భారతి, మస్తాన్‌బీ, కరాటే మాస్టర్ సుబ్రమణ్యం, నవతెలంగాణ బుకహేౌజ్ ఇంచార్జి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.