Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు టీఎమ్యూ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్యూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ తిరుపతి, ఏఆర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా సంస్థలో 2017 నాటి పీఆర్సీ అమలు చేయాలనీ, యూనియన్లపై ఆంక్షలు ఎత్తేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్టు తెలిపారు. మునుగోడు ఎన్నికల సమయంలో హడావుడిగా డిఏల సర్క్యులర్ తేదీలు లేకుండ జారీ చేశారనీ, దీనితో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు డిఏలు కలపడం లేదన్నారు. దీనితో రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు. సీసీఎస్, పీఎఫ్ ట్రస్ట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.