Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి సంస్థకు బొగ్గు గనులు దక్కకుండా చేసి, నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేస్తున్నదనీ, ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఎందుకో అర్థం కావడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వేలం పాట ద్వారా సత్తుపల్లిలోని కోయాలగుడెం కోల్ బ్లాక్‌ను ఔరో కోల్ ప్రయివేటు సంస్థకు ఆగస్టు 10న కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని వివరించారు.కోల్ బ్లాక్స్ లేకుంటే సింగరేణి సంస్థ ఏం పని చేయాలని ప్రశ్నించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కోల్ బ్లాక్స్‌ను వేలం వేసే పనులకు స్వస్తి పలకాలని చెప్పారు. ప్రయివేటీకరణ అనే పదం వాడకుండా వ్యూహాత్మకంగా కోల్ బ్లాక్స్ వేలం వేసి అప్పగిస్తూ, 'ఆ ఆలోచనే లేదు' అనడం ప్రజల్ని మోసం చేయడం కాక ఇంకేంటని ప్రశ్నించారు.