Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్‌రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
బీజేపి నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాపై రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని సుశీ ఇన్ఫ్రా ప్రధాన కార్యాలయంతో పాటు నల్లగొండలోని కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ఈ కంపెనీకి చెందని దాదాపు యాభై మంది ఉద్యోగులకు చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక ఈ రెడు కార్యాలయాల నుంచి పెద్ద మొత్తంలో రికార్డులు, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించక పోవడంపై ప్రధానంగా జీఎస్టీ అధికారులు దృష్టిని సారించారని తెలిసింది. కార్యాలయాలలో దాదాపు మూడు గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు ఈ సంధర్భంఆ రాజగోపాలరెడ్డి కుమరుడు సంకీర్త్ రెడ్డిని ప్రశ్నించారని తెలిసింది.