Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు మోడల్ స్కూల్ టీచర్ల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ల సంఘం (టీఎంఎస్టీఏ) కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావును సోమవారం హైద రాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇటీవల వివిధ కారణాలతో 27 మంది ఉపాధ్యా యులు మరణించారని, కారుణ్య నియామకాలు లేకపోవడంతో వారి కుటుం బాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను మంజూరు చేయాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల్లేక తొమ్మిదేండ్లుగా ఒకే స్కూల్లో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే పదోన్నతులు, బదిలీల ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.