Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - బీహార్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకానికి అమలు చేసిన విధాన ప్రక్రియను తెలియజ ేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నియామకానికి ముందు అర్హులైన వాళ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ందీ లేనిదీ వివరించాలని కోరింది. పూర్తి వివరాలను అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ ఆదేశించి ంది. సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయంటూ ఎ వినాయక్‌రెడ్డి పిల్ వేశారు. అయితే ఈ నియామకానికి అమలు చేసిన విధానాన్ని సీల్డ్ కవర్లో ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జీవో 54 ప్రకారమే సభ్యుల భర్తీ జరిగిందని ఏజీ బీఎస్ ప్రసాద్ వివరించారు. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.
ఆర్టీసీకి నోటీసు
ఆర్టీసీ ఎంప్లాయిస్ జీతాల నుంచి మినహాయించిన రూ.638 కోట్లు, ఈ ఏడాది అక్టోబర్ వరకు వడ్డీ రూ.266 కోట్లు కలిపి రూ.904 కోట్లు చెల్లించేలా ఆర్టీసీ మేనేజిమెంట్‌కు ఉత్తర్వులివ్వాలంటూ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ క్రెడిట్ అండ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆర్టీసిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ సోమవారం ఆదేశించారు. సొసైటీ కార్యదర్శి మహేశ్ ఇతరులు వేసిన రిట్ విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేశారు. గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చినా డబ్బులివ్వలేదంటూ పిటిషనర్ న్యాయమూర్తికి తెలిపారు.
నేడు బీజేపీ అప్పీల్‌పై విచారణ
ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారనే కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేయనుంది. కేసు దర్యాప్తును నిలిపేసిన సింగిల్ జడ్జి ఇటీవల దాన్ని రద్దు చేశారు. దీనిపై బీజేపీ అప్పీల్ పిటిషన్ వేసింది.