Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలపై వెంటనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ ప్రచారం కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ డిమాండ్ చేశారు. అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రం కోసం కొట్లాడిన దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాల నోట్లో మట్టి కొట్టి, తన కుటుంబానికి మాత్రం కొలువులు ఇచ్చుకున్నారని విమర్శించారు. లక్ష ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకూ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్...కనీసం ఊరికొక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదన్నారు. గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పారు.
అహ్మదాబాబాద్ నియోజకవర్గం పరిశీలకుడిగా జెట్టి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అహ్మదాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడుగా టీపీసీసీ మాజీ కార్యనిర్వహక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్ను ఏఐసీసీ నియమించింది.