Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎంఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆదివాసీలు, ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములన్నింటికీ పట్టాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతాంగ పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించాలనీ, వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలిపారు. ఖరీఫ్ పంటలన్నింటికీ పంట ఖర్చుల మీద 50 శాతం కల్పించి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని సూచించారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఆదివాసీలు, ఇతర పేదలు దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములన్నింటికీ సర్వే జరిపి పట్టాలివ్వాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు నష్టం కలిగించే విధంగా తెస్తున్న అటవీ సంరక్షణ నిబంధనలు-2022ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని కోరారు.