Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్
- బీహార్‌లో ఐదో జాతీయ మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - బీహార్
పర్యావరణాన్ని సైతం కార్పొరేట్‌శక్తులు వ్యాపారం చేస్తున్నాయని ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ విమర్శించారు. బీహార్‌లోని ముజఫర్‌నగర్ (మహమ్మద్ గౌస్ ప్రాంగణం)లో ఆ పార్టీ జాతీయ ఐదో మహాసభలు సోమవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వరికుప్పల వెంకన్న, శ్రీకుమార్, చంద్రమోహన్ ప్రసాద్, లీలాదేవి శర్మ, తూమాటి శివయ్య అధ్యక్షత వ్యవహరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ రానున్న కాలంలో పర్యావరణ రక్షణ కోసం యుద్ధాలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థిక సమతుల్యతను విస్మరిస్తున్నాయని చెప్పారు. సంపదను కొద్దిమంది సంపన్నులు దోచుకుంటున్నారని విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కాకుండా అడవులను విధ్వంసం చేస్తున్నారని అన్నారు. సామ్రాజ్యవాదులు పేద దేశాల మధ్య సరిహద్దు సమస్యను సృష్టిస్తున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలపై ఉన్న నిర్బంధం, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో సభ్యులు కిరణ్జిత్ సింగ్ షేఖాన్, ఈ జార్జ్, రాజా దాస్, కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, అనుభవ్ దాస్ శాస్త్రి, మహేందర్ నేహాతోపాటు తెలంగాణ కార్యదర్శి గాదగోని రవి పాల్గొన్నారు.