Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.06 కోట్లకు దక్కించుకున్న జారు వెంచర్స్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ నిఖిల ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్ స్వగృహ భూమిని వేలం వేశారు. కాగా ఈ భూమిని రూ.కోటీ ఆరు లక్షలకు జారు వెంచర్స్ దక్కించుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వికారాబాద్ మున్సిపాల్టీ గంగారంలోని రాజీవ్ స్వగృహ ఓపెన్ స్థలం 3.5 ఎకరాలకు పారదర్శకంగా బహిరంగ వేలంలో విక్రయించినట్టు తెలిపారు. బహిరంగ వేలంలో మొత్తం 40 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు.హైదరాబాద్కు చెందిన జారు వెంచర్స్ స్థలాన్ని చేజిక్కించుకుందని తెలిపారు. అనంతరం స్థలాన్ని చేజిక్కించుకున్న జారు వెంచర్స్ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ధ్రువీకరణపత్రం అందజేశారు. వేలంపాటలో ఆర్డీఓ విజయకుమారి, రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్రెడ్డి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.