Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ
- విద్యుత్ ఉద్యోగుల కృషితోనే ఇది సాధ్యమైంది
- విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి
- నూతన ఇంజినీర్లకు నియమక పత్రాలు అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో తెలంగాణ రాష్ట్రం ఛాంపియన్‌గా నిలిచిందనీ, దీనిపై దేశవ్యాప్తంగా రైతాంగం సహా అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నదని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎర్రగడ్డలోని టీఎస్జెన్కో ఆడిటోరియంలో శిక్షణ పూర్తిచేసుకున్న 69 అసిస్టెంట్ ఇంజినీర్లు, 178 మంది సబ్ ఇంజినీర్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 27.07 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామనీ, వ్యవస్థాపిత సామర్ధ్యం 7,778 మెగావాట్ల నుంచి 17,829 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ పటిష్టత కోసం రూ. 37,499 కోట్లు ఖర్చు చేశామన్నారు. 400 కేవీ సబ్ స్టేషన్ల సంఖ్యను 6 నుంచి 23 కు, 51 వున్న 220 కేవీ సబ్ స్టేషన్ల సంఖ్యను 99కి, 132 కేవీ సబ్స్టేషన్ల సంఖ్యను 249కు, 33 కేవీ సబ్ స్టేషన్ల సంఖ్యను 3,186 కు పెంచామని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు మాట్లాడుతూ నూతనంగా నియమితులైన ఉద్యోగులంతా నియమ నిబంధనలు పాటిస్తూ తమ విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రోత్సహంతో ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. నిరంతర విద్యుత్ అందిస్తూ, సరఫరా నష్టాలు తగ్గించాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లకు చేరిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఔట్్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న 22,774 మంది కార్మికులను ఆర్టిజన్లుగా నియమించామనీ, రికార్డు సమయంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాదిలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఇస్పటి వరకు సంస్థ పరిధిలో 4,177 నియామకాలు చేపట్టినట్టు తెలిపారు.