Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో నిర్వహించే ఈ భేటీలో బీఆర్ఎస్ విస్తరణే ప్రధానాంశంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆ సమావేశం ప్రారంభం కానుంది.
ఆ కాలేజీల్లో క్లాసులను ప్రారంభించనున్న సీఎం...
రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. మధాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి ఆయన ఆన్లైన్లో ఒకేసారి ఆయా క్లాసులను ఆయన ప్రారంభిస్తారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యా సంవత్సరం తరగతులు ఆరంభమవుతాయి.