Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎస్జీహెచ్ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 40 ప్రభుత్వ పాఠశాలలకు తొమ్మిది, పది తరగతులకు సంబంధించిన అనుమతులు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్లోని ఆమె క్యాంపు కార్యాలయంలోఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజు గంగారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆంగ్ల మాధ్యమం తరగతులకు అనుమతులను ఇప్పించాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. తమ సంఘం గతంలో చేసిన వివిధ ప్రాతినిథ్యాలకు సంబంధించిన దస్త్రాలు పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయనీ, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ విద్యాశాఖ కార్యదర్శితో సంప్రదిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.