Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం పట్ల రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మెన్ వై.సతీష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగించాలని కోర్టు సూచించడంతో...ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనక ఉన్న అసలు నిందితులెవరో బట్టబయలు కాబోతున్నదని పేర్కొన్నారు. సిట్ విచారణతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీలో వణుకు మొదలైందని తెలిపారు. ఈ కేసులో బీజేపీ నేతల హడావుడితోనే...టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది వారేనని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేదంటూనే ఏకంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. సీబీఐ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ జేబులోని చిలుక కాబట్టే సీబీఐకి కేసును బదిలీ చేయాలని బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లారని విమర్శించారు.