Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారనీ, రాజ్‌భవన్ బీజేపీ రెండో ఆఫీసుగా మారిందని మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారిని రాజకీయాలలో లాగకూడదన్న ఇంగిత జ్ఞానం మంత్రులకు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు హాజరుకాకపోవడంపై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.