Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రక్రియను పూర్తి చేయాలంటూ అధికారులకు కేసీఆర్ ఆదేశం
- నేడో, రేపో ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాకుల క్రమబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు రంగంసిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఆర్థిక, విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్టు సమాచారం. అర్హులైన వారి జాబితాను విద్యాశాఖ నుంచి ఆర్థిక శాఖకు పంపించారు. క్రమద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు బుధ లేదా గురువారం వచ్చే అవకాశమున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మొదటి విడతలో జనరల్, ఒకేషనల్ విభాగాల్లో కలిపి 3,300 మంది కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశమున్నది. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సర్టిఫికెట్లపై అనుమానాలున్న వారిని రెండోవిడతలో క్రమబద్ధీకరించనున్నట్టు తెలిసింది. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించి 2016, ఫిబ్రవరి 26న రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ 16ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒకేషనల్ విభాగంలో మినిమం టైంస్కేల్ (ఎంటీఎస్) కింద పనిచేస్తున్న 203 మంది ఎంటీఎస్ కాంట్రాక్టు అధ్యాపకులు, సిబ్బంది సర్వీసులను ఇప్పటి వరకు క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే.