Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రీ పెయిడ్ రైళ్లలో ఆయా ప్రాంతాల ఆహారాలు తయారుచేసి, సరఫరా చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ శాఖ నిర్ణయించిన ఆహారాన్ని మాత్రమే భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) రైళ్లలో విక్రయించేది. ఇకపై ఆయా రాష్ట్రాల్లోని ఆహార అలవాట్లకు అనుగుణంగా ప్రాంతీయ వంటకాలను కూడా మెనూలో చేర్చనున్నారు. అయితే ప్రస్తుతం ఈ అవకాశం ప్రీ పెయిడ్ రైళ్లకు (మెయిల్ ఎక్స్ప్రెస్, రాజధాని తరహా) మాత్రమే వర్తిస్తుంది. ఈ రైళ్లలో టిక్కెట్ బుకింగ్ సమయంలోనే ప్రయా ణంతో పాటు ఆహారానికి కూడా చార్జీని వసూలు చేస్తారు. ఆ సమయ ంలో మెనూలో మారిన ఆహార పదార్ధాలను ప్రయాణీకులు బుక్ చేసుకోవచ్చు. అలాగే డయాబెటిక్ ఫుడ్, బేబీ ఫుడ్, చిరుధాన్యాలు సహా పండుగ సమయంలో తయారుచేసే ప్రత్యేక ఆహార అవసరాలకు అనుగుణంగా మెనూను మార్చుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలన్నీ ఎమ్మార్పీ ధరకు విక్రయిస్తారు. జనతా ఆహారంలో ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరు ణ్ కుమార్ జైన్ తెలిపారు. రైలు ప్రయాణీకుల అంచనాలకు సరిపడేలా ఆహార పదార్ధాల నాణ్యతా ప్రమాణాలను పాటించాలని చెప్పారు.