Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనులను ఏకం చేసి బ్రిటీషు పాలకులపై పోరాడిన వీరుడు బిర్సాముండా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బిర్సాముండా జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..బిర్సాముండా గౌరవార్థం పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆయన పేరిట మ్యూజియాన్ని నిర్మించారని తెలిపారు.
హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. దీంతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు పురోగతి వివరాలను బహిర్గతపర్చకూడదనీ, ఈనెల 29లోపు పురోగతి నివేదికను సీల్డ్ కవర్లో సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామం అని పేర్కొన్నారు.