Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రిస్మస్ వేడుకలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రైస్తవ కుటుంబాలకు నాణ్యమైన దుస్తులు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్లలోని అతి బీద కుటుంబాలకు 2.25 లక్షల చీరలు పంపిణీ చేయాలని సూచించారు.డిసెంబర్ మొదటి వారంలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ సాగర్, మైనారిటీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి హెచ్ఎం నదీమ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎమ్డీ కాంతి వెస్లీ, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ కాసిం తదితరులు పాల్గొన్నారు.