Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దహెగాంలో కోడె..
నవతెలంగాణ - వాంకిడి/దహెగాం
కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చౌపన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో పులి దాడి చేయడంతో గిరిజన రైతు సిడాం భీము(69) మృతిచెందాడు. సోమవారం రాత్రి పత్తి చేనుకు కాపలాకు వెళ్లగా పులి దాడి చేసింది. భీమును కొంతదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పులి రైతును హతమార్చడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భీము కుటుంబ సభ్యులకు అటవీ శాఖ అధికారులు ఎక్స్గ్రేషియా అందజేసి ఆదుకోవాలని సర్పంచ్ సిడాం అన్నిగ కోరారు.
దహెగాంలో కోడె మృతి
దహెగాం మండలంలోని ఖర్జీ అటవీ ప్రాంతంలో పెద్దపుల్లి దాడిలో కోడె మృత్యువాత పడింది. మేతకు వెళ్లిన ఎద్దుపై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృత్యువాత పడినట్టు రైతు లంగారి వెంకటేశ్ తెలిపారు. కోడె విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు.