Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి వినతి
నవతెలంగాణ - ధన్వాడ
దళిత రైతులకు వెంటనే పాసు పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపుర్ గ్రామంలో ప్రభుత్వం 2015లో 50 దళిత కుటుంబాలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, దళితుల ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన భూములకు బాధితులకు పట్టాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పాస్ పుస్తకాలు సాధించుకుందామన్నారు. పాసు పుస్తకాలు లేని కారణంగా రైతులకు బ్యాంకు రుణాలు, భీమా, రైతుబంధు అందడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ్మినేని వెంట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాయకులు గోపాల్, బాలరాజ్, రాయుడు తదితరులు పాల్గొన్నారు.