Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి కండ్లముందే పిల్లాడి దుర్మరణం
నవతెలంగాణ-హత్నూర
ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం మూడేండ్ల పిల్లాడి ప్రాణాలను బలిగొన్నది. అన్నయ్యను స్కూ లుకు పంపించేందకు అమ్మతో కలిసి రోడ్డు దాటుతున్న ఆ పిల్లాడిని ట్రాక్టర్ బలంగా ఢకొీట్ట డంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో మంగళ వారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ గ్రామానికి చెందిన కాలే మాలతి, నవీన్ దంపతులకు ఇద్దరు సంతానం. అయితే పెద్దకొడుకును స్కూలుకు పంపించేందుకు మాలతి తన చిన్నకొడుకు శ్రీహాన్(3)తో కలిసి రోడ్డు దాటుతున్నది. ఈ క్రమంలో టీఎస్15యూఈ2704 అనే నెంబర్ గల ట్రాక్టర్ దౌల్తాబాద్ గాంధీ చౌరస్తా నుంచి బస్టాండు వైపు అతివేగంగా వస్తూ శ్రీహాన్పైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ వెనుక చక్రం ఆ పిల్లాడి తలపై నుంచి వెళ్లడంతో.. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నతల్లి కండ్ల ముందే క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదంతో ఆమె బోరున విలపించింది. ఈ ప్రమాద ఘటనను చూసిన స్థానికులు సైతం కంటనీరుపెట్టుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లి మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.