Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం
నవతెలంగాణ-నిర్మల్
షార్ట్ సర్క్యూట్తో ప్రయివేటు బస్సు దగ్ధమయింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లోని గంజాల్ టోల్ ప్లాజా సమీపంలో ఎన్హెచ్ 44 జాతీయ రహ దారిపై మంగళ వారం వేకువజామున మూడు గంటల సమయంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ పూర్ నుంచి హైదరా బాద్ వెళ్తున్న మహా రాష్ట్రకు చెందిన ఎంహెచ్ 40 ఏటీ 9966 నెంబర్ గల బస్సులో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో బస్సులో ప్రయాణిస్తున్న 29 మందిని లగేజీ సహాయంతో కిందకి దింపేశాడు. దాంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న సోన్ సీఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్ఐ సంతోషం రవీందర్, అశోక్ ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ఇంజన్ సాయంతో మంటలు అర్పించారు. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్, ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏ కొంత ఆలస్యం అయినా పెను ప్రమాదం సంభవించేది.