Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్-సిటీబ్యూరో
జేకేడీ జాతీయ స్థాయి కుంగ్‌ఫూ మార్షల్ ఆర్ట్స్‌లో పోటీల్లో నగరానికి చెందిన బాలుడు బంగారు పతకం సాధించాడు. ఇతనితో పాటు మరో బాలుడు వెండి పతకాలను సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గత మూడు రోజులుగా సాగిన 34వ జాతీయ స్థాయి జేకేడీ కుంగ్‌ఫూ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో ఈ పతకాలను నగర బాలలు సాధించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 450 మంది మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన క్రీడాకారులు 19 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ బేగంబజార్ ప్రాంతం నుంచి ఇద్దరు బాలురు పాల్గొన్నారు. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నుంచి ఈ బాలురు పాల్గొన్నారు. వీరిలో జీ.హేమ్ ఫైట్ పోటీలో బంగారు పతకాన్ని, కటా, వెపన్ విభాగాలలో రెండు కాంస్య పతకాలను సాధించాడు. అలాగే కౌశిక్ సింగ్ అనే బాలుడు కటా, వెపన్, ఫైట్ విభాగాలలో మూడు వెండి పతకాలను సాధించాడు. పతకాలు సాధించిన బాలలకు జేకేడీ మార్షల్ ఆర్ట్స్ విభాగం చైర్మెన్ రాజేంద్ర రాథోడ్ పతకాలను అందజేశారు. రాష్ట్రం నుంచి పాల్గొన్న బాలలకు హైదరాబాద్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ అధిపతి జి. అజిత్ నేతృత్వం వహించాడు.