Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మహేందర్, ఎ.శ్రవణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్:అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం(గ్రూప్-సి) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉకంటి మహేందర్, ఎ.శ్రవణ్‌కుమార్, కోశాధికారిగా ఎన్.రాఘవేంద్రగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. హన్మకొండలో అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం (గ్రూప్-సి) రాష్ట్ర మూడో మహాసభలు 13 నుంచి 15 వరకు విజయవంతంగా జరిగాయి. 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిధులుగా కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి జనార్దన్ మజుందార్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జె వెంకటేష్ ,తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కె ప్రకాష్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాంనాయక్ హాజరై మాట్లాడారు. దేశంలోని 75 శాతం పోస్టల్ సభ్యులతో సభ్యత్వం కలిగి ఉన్న గొప్ప సంఘం అనీ, అనేక ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్నదన్నారు. తపాలా శాఖ ప్రయివేటీకరణను అడ్డుకోవడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి అహర్నిశలు కషి చేయడం సంఘం ప్రధాన లక్ష్యమని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో పి సురేష్, ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి డీఏ ఎస్వీ ప్రసాద్,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బి శ్రీధరబాబు , మాజీ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ ప్రతాప్ రెడ్డి పోస్టుమేన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏం మధుసూదన్, కోఆర్డినేషన్ కమిటీ చైర్మెన్ జలాలుద్దీన్, అప్పల నాయుడు, రాంరెడ్డి, గ్రామీణ డాక్ సేవక్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెఎన్.చారి, రిసెప్షన్ కమిటీ అధ్యక్షులు, కన్వీనర్లు కె.సుధాకర్, ఈ నరేందర్, జె.కుమారస్వామి, హెచ్.సీతారాం తదితరులు పాల్గొన్నారు.