Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు జాక్టో వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు షెడ్యూల్‌ను సత్వరమే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో జాక్టో చైర్మెన్ జి సదానందంగౌడ్, సెక్రెటరీ జనరల్ ఎం రాధాకృష్ణ, కోశాధికారి కె కృష్ణుడు, నాయకులు ఎం పర్వత్‌రెడ్డి, ఎస్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు పదోన్న తులిస్తామంటూ బడుల ప్రారంభానికల్లా పూర్తి చేస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలకు మంత్రి హామీనిచ్చారని తెలిపారు. ఆర్నెల్లు గడిచినా ఆ దిశగా ఎలాంటి చర్యలు మొదలు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 రావడంతో పదోన్నతులకు ఆటంకాలు తొలగిపోయాయని తెలిపారు. అన్ని రకాల పదోన్నతులు ఇవ్వనుందంటూ అసెంబ్లీలోనే స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. అయినా పదోన్నతులపై జాప్యమెందుకు జరుగు తుందో అంతుపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీహెచ్ఎంఏ గౌరవాధ్యక్షులు గుండం మోహన్‌రెడ్డి, టి సచ్చిదానందరెడ్డి, బీటీఏ నేత కె చైతన్య, ఎస్‌ఎల్‌టీఏ నాయకులు చక్రవర్తుల శ్రీనివాస్, గౌరీశంకర్, టీఆర్టీయూ నాయకులు బి అనిల్‌కుమార్, రాజ గోపాల్‌సింగ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.