Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలను కించపరుస్తూ మాట్లాడిన గరికపాటి నర్సింహరావు మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ నాయకులు ఎస్ పుణ్యవతి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని వీరనారి ఐలమ్మ ట్రస్టు భవన్లో ఐద్వా ఆధ్వార్యాన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ గరికపాటి ప్రవచనాలతో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడటం ఎంత వరకు సబబో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలు పనులు చేసేటప్పుడు చీరెలు అసౌకర్యంగా ఉంటాయని చెప్పారు. చేస్తున్న పనిమీదనే దృష్టి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గరికపాటి అర్థం చేసుకోవాలని సూచించారు. తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం మానుకోవాలన్నారు. స్త్రీల కట్టు, బోట్టు,వారి అవయవాల మీద వ్యాఖ్యానాలు చేసే హక్కు గరికపాటికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. లైంగిక వేదింపుల నిరోదక చట్టం, వర్మ కమిషన్ రిపోర్టుల ప్రకారం శిక్షార్హుడవుతారని తెలిపారు. స్త్రీలు కూడా మనుషులేననీ, వారిని బోగ వస్తువుగా చూడకూడదని హితవు పలికారు. ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి మాట్లాడుతూ గరికపాటి ప్రతి ప్రవచనంలో స్త్రీలను అగౌరవ పరుస్తూ మాట్లాడుతున్నారన్నారు. భూమిక ఎడిటర్ సత్యవతి మాట్లాడుతూ గరికపాటిపై అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టాలన్నారు. స్త్రీల పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఆయనెవరని ప్రశ్నించారు.పీఓడబ్ల్యు సంద్య మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీలపై అడ్డగోలుగా మాట్లాడేవారి సంఖ్య పెరిగిందని చెప్పారు. అంకురం శామల మాట్లాడుతూ తినే తిండి, కట్టుకునే బట్టల మీద ఆంక్షలు విధించే రాజ్యంలో మనం ఉన్నామన్నారు. ఎల్ఐసీ అరుణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శరీరాన్ని ఏనుగుతో పోలుస్తూ అవహేలన చేయటం నేరమన్నారు.పీఓడబ్ల్యు ఝాన్సీ, పుష్ప, ఐద్వా రాష్ట్ర నాయకులు కె నాగలక్ష్మి, ఎం లక్ష్మమ్మ, పి.రమాదేవి, ఎ పద్మ తదితరులు పాల్గొన్నారు.