Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెడికల్ సేల్స్ రిప్రజెంటీటివ్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో జాతీయ సదస్సు, ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలంగాణ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ) తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎంఎస్‌ఆర్‌యూ అధ్యక్షులు సీహెచ్.భాను కిరణ్, ప్రధాన కార్యదర్శి ఐ.రాజుభట్, ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటీటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఆర్ఏఐ) సంయుక్త ప్రధాన కార్యదర్శి కె.సునీల్ కుమార్, టీఎస్ఎంఆర్యూ సంయుక్త ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజుభట్ మాట్లాడుతూ, గత వందేండ్ల నుంచి ఔషధాల ప్రాధాన్యతను ప్రచారం చేస్తున్నామనీ, 60 ఏండ్ల నుంచి యూనియన్‌గా వర్కింగ్ రూల్స్ కోసం అన్ని ప్రభుత్వాలకు విన్నవించుకున్నామని తెలిపారు. డిజిటలైజేషన్, నూతన సాంకేతికత పేరుతో కొత్తరకం పని పద్ధతులను తీసుకొస్తూ ఉద్యోగులను యాజమాన్యాలు వేధిస్తున్నాయని విమర్శించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో త్రైపాక్షిక చర్చలకు అవకాశం కల్పించారనీ, ఆ చర్చల్లో ఇది వరకే తెచ్చిన తమకు నచ్చలేదని చెప్పినట్టు వివరించారు. ఢిల్లీలో జరగ బోయో ర్యాలీలో దాదాపు 20 వేల మంది పాల్గొం టారనీ, దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది మెడికల్ సేల్స్ రిప్రజెంటీటివ్లు ఉండగా, అందులో ఒక లక్ష మంది తమ యూనియన్‌లో ఉన్నారని చెప్పారు. ఔషధాల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకో వాలనీ, జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ పోరాటా ల తర్వాత 1987లో వర్కింగ్ రూల్స్ సవరించారనీ, లేబర్ కోడ్ పేరుతో ఆ చట్టాన్ని పూర్తిగా తొలగించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కన్ని యాజ మాన్యాలు అన్యాయంగా ఉద్యోగులను తొలగించా రనీ, దీనిపై కేంద్రానికి వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఢిల్లీలో మహా ర్యాలీకి పిలుపునిచ్చినట్టు వివరించారు. ఉద్యోగులపై వేధింపుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగే సదస్సులో ఐఎంఏ జాతీయ అధ్యక్షునితో పాటు పలువురు ఈ రంగానికి చెందిన ప్రముఖులు, విశ్లేషకులు పాల్గొంటున్నారని తెలిపారు.