Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ విచారణకు హైకోర్టు నో
- బీజేపీ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. సిట్ దర్యాప్తుపై స్టే విధించాలన్న బీజేపీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కోర్టు విచారించింది. సీబీఐతో గాని లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు విచారణ పురోగతిని ఈనెల 29న జస్టిస్ విజయసేన్‌రెడ్డి బెంచ్‌కు అందించాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను రాజకీయ నాయకులకు, మీడియాకు, కార్యనిర్వాహక వ్యవస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ చేయొద్దనీ, ఒక వేళ అలా జరిగితే తగిన చర్యలు తీసుకొంటామని సీజే ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును జస్టిస్ విజయసేన్‌రెడ్డి పర్యవేక్షిస్తారని సీజే ఉజ్జల్ భుయాన్ తెలిపారు.