Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐబీఎస్లో జరిగిన ర్యాగింగ్ కేసులో నిందితుడైన తన కుమారుడు మైనరనీ, అందువల్ల అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితుని తల్లి హైకోర్టు తలుపులు తట్టారు. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసి విచారణను వాయిదా వేశారు. శంకర్పల్లిలోని ఐబీఎస్లో ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేశారనే అభియోగాలపై పోలీసులు 10 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొట్టడం,ర్యాగింగ్,లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వారిపై కేసు నమోదైంది. ఆ పది మందిలో ఒక నిందితుడి వయసు 17 ఏండ్లనీ, అతను తన కుమారుడనీ, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అతడి తల్లి దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు.