Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హదరాబాద్
గిరిజనుల హస్త కళా ప్రదర్శనలతో హైదరాబాద్లోని రాజ్భవన్లో బుధవారం జన్ జాతీయ గౌరవ్ దివస్ ను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ ఆదివాసీలు, గిరిజనుల సాధికారత సుస్థిర ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు.
విద్యతో పాటు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం రాజ్ భవన్ గట్టి ప్రయత్నిస్తుందని తెలిపారు. మరో ఆరు మారుమూల గిరిజన ఆవాస ప్రాంతాలను దత్తత తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధులు బిర్సా ముండాకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, అధికారులు, గిరిజన కళాకారులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.