Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ నూతన డైరెక్టర్గా డాక్టర్ కొండా నాగేశ్వర్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు ఆయన్ను ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ జాడి ముసలయ్య, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ చెల్లమల వెంకటేశ్వర్లు, యూసీఐఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణ కుమార్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ సీనియర్ రీసెర్చ్ స్కాలర్లు ఆంజనేయులు, వి తిరుపతి సాయిరే, ఈక్షిత్, శ్రీనివాస్ గుండేవార్, దౌలత్, విద్యార్థి నాయకులు దుర్గం శివ, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ ఈ రీసెర్చ్ సెంటర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సెంటర్ ప్రతిష్టను ఉన్నతంగా తీర్చి దిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తామని వివరించారు.