Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రిలో ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్యం చేయించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నిమ్స్ విస్తరణకు రూ. 1,571 కోట్ల నిధులను కేటాయిస్తూ బుధవారం వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు కేటాయించడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం తీసుకుంటున్న చర్యల్లో ఈ నిర్ణయం మరో ముందడుగు అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.