Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు 'అర్జున అవార్డు' రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా బాక్సింగ్‌లో వరుస విజయాలను నమోదు చేస్తూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు నూటికి నూరు శాతం అర్హురాలని పేర్కొన్నారు. యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందని సీఎం తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా నిఖత్ జరీన్‌కు అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.