Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్లు రెండు కండ్లయితే, నుదుట తికలంగా కాంతారావు ఖ్యాతి గడించడం తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రఖ్యాత నటుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, తెలంగాణ బిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99 వ జయంతి (నవంబర్ 16) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కాంతారావు 400కు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారనీ, సినీ కళారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని స్మరించుకున్నారు.