Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల బాధ్యత గురుతరమైంది : సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయడంలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల బాధ్యత గురుతరమైనదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. ఇటీవల పలు జిల్లాలలో పోస్టింగ్లు పొందిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు తమ రెండు రోజుల శిక్షణ బుధవారం పూర్తిఅయింది. ఈ సందర్భంగా బీఆర్కే భవన్లో వారితో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు, పల్లె ప్రకృతి వనాలు, బహత్ ప్రకృతి వనాలు, శశ్మాన వాటికలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల, పట్టణాల పర్యటనలకు వెళ్లే ముందు సమస్యలపై పట్టు సాధించాలనీ, సమస్యల పరిష్కారం దిశలో విస్తృతంగా పర్యటనలు చేయాలని దిశానిర్దేశం చేశారు. కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితం కాకుండా పనిలో ప్రగతి చూపాలనీ, స్థానిక ప్రజలతో మమేకం కావడంతోపాటు భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్య నారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు.