Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి టీజేఎఎమ్యూ ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికుల పీఆర్సీకి అనుమతి ఇమ్మని ఎలక్షన్ కమిషన్‌ను కోరిన ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికే లేఖ రాసారా అంటూ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో ఎద్దేవా చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికుల ఓట్ల కోసం హడావిడి చేసిన మంత్రులు కే తారకరామారావు, టీ హరీశ్‌రావు, పువ్వాడ అజరుకుమార్, చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. 16 నెలల క్రితం 9 లక్షల 18 వేల మంది రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం 48 వేల మంది ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు. తక్షణం రెండు వేతన సవరణలు చేసి, ఆర్టీసీ కార్మికుల ఇతర సమస్యల్ని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.